Ni Kaali Gajjela Pattilu by Suman Badnakal, Mounika song Lyrics and video

Artist:Suman Badnakal, Mounika
Album: Single
Music:Venkat Ajmeeera
Lyricist:AS Chauhan
Label:Aaryan Music
Genre:Folk
Release:2025

Lyrics (English)

పిల్ల నీ కాలి గజ్జెల పట్టీలు
నీ సేతి గాజుల సైగాలు
నీ ముద్దు మాటల పిలుపులు
నన్ను రమ్మంటున్నాయి అమ్ములు
ఊరికి పోయేటి తోవాలు
నడి మధ్యన వాగులు వంకాలు
నాకేమో మస్తుగా భయ్యాలు
తోడురమ్మని పిలిచనోయి బావాలు
అయ్యో దేనికే పిల్ల భయాలు
నీ తోడుగా నేనున్నా అమ్ములు
నువ్వు నాపైనా చూపే ప్రేమలు
నా గుండెలో నింపాయి ధైర్యాలు
నా సక్కని సుక్కై ప్రేమాలు
నీపై కలకాలంముంటాయి అమ్ములు
నీ కాలి గజ్జెల పట్టీలు
నీ సేతి గాజుల సైగాలు
నీ ముద్దు మాటల పిలుపులు
నన్ను రమ్మంటున్నాయి అమ్ములు
ఆ రాజన్న సిరిసిల్ల చిరాలు కట్టుకొని అమ్ములు
పచ్చని పైరుల్లో నడిచొస్తే నా గుండెల్లో ఏదో సంతోషాలు
తల మీద సుట్టావు రుమాలు చేతికి తొడిగావు కడియాలు
పైనంగా తిప్పావు మీసాలు అది చూసి నాలో ఆనందాలు
నిన్ను జేసుకుంటా గారాలు పెట్టమాకు పై పై బేరాలు
అయ్యో పెట్టబోను బేరాలు నాకు ఇట్ఠమే నీ గారాలు
కోటి ఆశల నా కలల ప్రపంచంలో నువ్వు నిజమల్లే వచ్చావు అమ్ములు
నీ కాలి గజ్జెల పట్టీలు
నీ సేతి గాజుల సైగాలు
నీ ముద్దు మాటల పిలుపులు
నన్ను రమ్మంటున్నాయి అమ్ములు
భారత్ల్య్రిక్స్.కోమ్
ఆ గోదారి అలలెల్ల ప్రేమాలు పొంగి పొర్లేనే అమ్ములు
నీ పైన నా కోటి ఆశలు నా మనసంతా నువ్వే అమ్ములు
నీ ప్రేమకు పడిపోయా బావాలు నీ మాటను దాటని సీతాలు
నువ్వు సై అంటూ జేసింది సైగాలు ప్రేమ అల్లుకుపోతానోయ్ బావాలు
రంగు రంగు కొత్త లోకాలు మనమందులో ప్రేమ జంటాలు
నీ సరసన ఉంటే సరదాలు ప్రతిరోజు పండగే బావాలు
నా బంధము నువ్వే బలగం నువ్వే బతుకు బాటల్లో వెలుగు నువ్వే
నీ కాలి గజ్జెల పట్టీలు
అబ్బా నీ కాలి గజ్జెల పట్టీలు
నీ సేతి గాజుల సైగాలు
నీ ముద్దు మాటల పిలుపులు
నన్ను రమ్మంటున్నాయి అమ్ములు
అరె ఊరికి పోయేటి తోవాలు
నడి మధ్యన వాగులు వంకాలు
నాకేమో మస్తుగా భయ్యాలు
తోడురమ్మని పిలిచనోయి బావాలు
అయ్యో దేనికే పిల్ల భయాలు
నీ తోడుగా నేనున్నా అమ్ములు
నువ్వు నాపైనా చూపే ప్రేమలు
నా గుండెలో నింపాయి ధైర్యాలు
నా సక్కని సుక్కై ప్రేమాలు
నీపై కలకాలంముంటాయి అమ్ములు
లలలల… లలలల
లలలల… లలలలల.
Bharatlyrics.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Ni Kaali Gajjela Pattilu lyrics in Telugu by Suman Badnakal, Mounika, music by Venkat Ajmeeera. Includes YouTube video and lyrics in multiple languages.